: కడపలో కిడ్నాప్ చెర నుంచి విడుదలైన ఎన్నికల అధికారి


కడపలో కిడ్నాప్ కు గురైన ఎన్నికల అధికారి చంద్రశేఖర్ కిడ్నాపర్ల చెర నుంచి బయట పడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పిలుస్తున్నారంటూ కిడ్నాపర్లు మంగళవారం రాత్రి తనను రిమ్స్ ఆసుపత్రికి, అటునుంచి మదనపల్లెకి తీసుకెళ్ళారని చంద్రశేఖర్ తెలిపారు.

రాత్రంతా అక్కడే ఉన్న అనంతరం ఉదయం కుటుంబ సభ్యులకు ఫోను చేసుకునే అవకాశం ఇచ్చారని, ఎంత అడిగినా కిడ్నాప్ ఎందుకు చేశారో వారు చెప్పలేదని ఆయన తెలిపారు. బుధవారం ఉదయం ములకల చెరువు దగ్గర విడిచిపెట్టడంతో ... కిడ్నాప్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చంద్రశేఖర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News