: గులాబీ పుచ్చుకోనున్న ఎమ్మెల్యే వేణుగోపాలాచారి
టీడీపీ అసంతృప్త ఎమ్మెల్యే వేణుగోపాలాచారి రేపు గులాబీ దండు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన టీడీపీకీ పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం కోసం టీడీపీ నుంచి బయటకు వస్తున్నట్లు లోగడే ఆయన ప్రకటించారు. అయితే, ఆ తర్వాత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సమయంలో పార్టీ విప్ ధిక్కరించినందుకు ఆయనపై టీడీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అది స్పీకర్ పరిశీలనలో ఉంది. ఈ లోపే వేణుగోపాలాచారి టీఆర్ఎస్ లో చేరిపోవాలని నిర్ణయించుకున్నారు.