: స్థిరంగా అల్పపీడనం.. 24 గంటలపాటు వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర సహా, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం వెంట 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.