: నేటితో ముగియనున్న నామినేషన్ల గుడువు
పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టానికి నేటితో తెరపడబోతోంది. రాష్ట్రంలోని 21,441 పంచాయతీలకు నామినేషన్లు వేసేందుకు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకూ సమయం ఉంది. నేటివరకూ దాఖలైన నామినేషన్లను 14న పరిశీలిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై 15 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అప్పీలు చేసుకునే అవకాశముంటుంది. వీటిని 16 న పరిష్కరిస్తారు. 17 వ తేదీ సాయంత్రం 3 గంటల లోపు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు సమయమిచ్చారు. ఇది కూడా పూర్తయిన తరువాత బరిలో ఉన్నవాళ్లెవరనే జాబితా ప్రకటిస్తారు.