: కొలెస్టరాల్‌తో పోరాడే కొత్తిమీర
ఏదైనా చెప్పే సమయంలో మనం ఎదుటివారిని అడ్డుకునేందుకు వెటకారంగా 'కొత్తిమీర కట్టేం కాదూ...' అంటుంటాం. అయితే మన శరీరంలో కూడా అధికంగా ఉండే కొలెస్టరాల్‌తో కొత్తిమీర కట్టే పోరాడుతుందట. అంతేకాదు, మనశరీరాన్ని అనేక రోగాల బారిన పడకుండా కూడా కాపాడుతుందట.
మనం సువాసనకు కూరల్లో వేసే కొత్తిమీర కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. అయితే ఈ కొత్తిమీర వల్ల పలు ప్రయోజనాలున్నాయట. తరచూ వంటకాల్లో కొత్తిమీర వాడకం వల్ల రక్తంలోని కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా జీర్ణశక్తిని పెంపొందించే గుణం కూడా దీనికి ఎక్కువగా ఉంటుంది. ఇందులో వుండే ఐరన్ రక్తవృద్ధికి తోడ్పడుతుంది. ఇది చక్కటి యాంటీసెప్టిక్‌గా కూడా ఉపయోగపడుతుంది. గాయాలు, నోటిపూత వంటివి త్వరగా తగ్గేందుకు కొత్తిమీర చక్కగా ఉపయోగపడుతుంది. మనలోని నిస్సత్తువను తగ్గించి శక్తినందిస్తుంది. కొత్తిమీరలో ఉండే ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ మరియు సి లు కంటిచూపుని మెరుగుపరచడంలో బాగా తోడ్పడతాయి. కాబట్టి కూరల్లో కొత్తిమీరని బాగా వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!