: లక్షలమంది పొగతాగి 'పోతున్నారు'!


ప్రతి ఏటా పొగతాగి కొన్ని లక్షలమంది చనిపోతున్నారు. ఒకవైపు 'పొగ మానండి బాబూ' అని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా... మరోవైపు 'ఈ ఒక్కటే...' అంటూ ఒక్కటొక్కటిగా గుప్పుగుప్పుమంటూ పొగచుట్టల్ని లాగించేస్తున్నారు పొగరాయుళ్లు. ఇలా పొగతాగి ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 60 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) అంచనాలో తేలింది.

పొగతాగడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా 60 లక్షల మంది మరణిస్తున్నారని, ఈ మరణాలు అల్ప, మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల్లోనే ఎక్కువగా సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి పొగాకు వినియోగ మృతుల సంఖ్య ఏడాదికి 80 లక్షలకు పెరిగే ప్రమాదముందని ఈ సంస్థ హెచ్చరించింది.

ఈ నివేదిక గురించి డబ్ల్యుహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ మార్గరెట్‌ చాన్‌ మాట్లాడుతూ, పొగాకు సంబంధిత అనారోగ్యం, మరణాలనుంచి తమ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి దేశంపైనా ఉందని అన్నారు. 20వ శతాబ్దంలో పొగాకు వినియోగం వల్ల మొత్తం 10 కోట్లమంది మృత్యువాత పడ్డారు. పొగాకు వినియోగానికి సంబంధించి ప్రపంచ దేశాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని, దీని వినియోగాన్ని అడ్డుకోకుంటే ఈ దశాబ్దంలో పొగతాగి మరణించే వారిసంఖ్య వంద కోట్లకు చేరుకునే ప్రమాదముందని ఈ సంస్థ హెచ్చరిస్తోంది. పొగాకు వాణిజ్య ప్రకటనలు, ఉత్పత్తులపై ప్రచారం, ప్రాయోజకత్వం వంటి వాటిపై పూర్తిగా నిషేధం విధిస్తేనే దేశాల్లో పాగాకు వినియోగం తగ్గుతుందని మనకు తెలుసని డగ్లస్‌ బెచెర్‌ పనామా సదస్సుల్లో స్పష్టం చేశారు. ధూమపాన మరణాలను తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి కట్టుగా పొగాకుపై నిషేధం విధించడంతోబాటు పలు నియంత్రణా చర్యలు తీసుకుంటే కొద్ది సంవత్సరాల్లోనే పాగాకు వినియోగాన్ని బాగా తగ్గించవచ్చని డగ్లస్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News