: బాలీవుడ్ విలన్ ప్రాణ్ కన్నుమూత


బాలీవుడ్ లో విలన్ గా ఖ్యాతి పొందిన ప్రాణ్ (93) మరిలేరు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రాణ్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రాణ్ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. కృష్ణంరాజుతో 'తాండ్రపాపారాయుడు'లోనూ, చిరంజీవితో 'కొదమసింహం'లోనూ నటించారు. ఇటీవలే ఆయనను భారత ప్రభుత్వం 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డుతో గౌరవించింది. 2001లో ఆయనను 'పద్మభూషణ్' పురస్కారం వరించింది.

ఫొటోగ్రాఫర్ కావాలనుకున్న ప్రాణ్ సినిమా నటుడయ్యాడు. తన కెరీర్లో పెక్కు అవార్డులు స్వంతం చేసుకున్న ప్రాణ్.. మళ్ళీ జన్మంటూ ఉంటే ప్రాణ్ గానే పుట్టాలనుందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించి తనపై తనకు గల మమకారాన్ని చాటుకునేవారు. ఆయన దాదాపు 350పైగా చిత్రాల్లో నటించారు.

  • Loading...

More Telugu News