: రసపట్టులో 'యాషెస్' టెస్టు
ప్రతిష్ఠాత్మక యాషెస్ సమరంలో భాగంగా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ లో జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఓవర్ నైట్ స్కోరు 80/2 తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అయితే, వారి ఆధిక్యం 153 పరుగులే కాగా, చేతిలో నాలుగు వికెట్లే ఉన్నాయి. ఆటకు మరో రెండు రోజుల సమయం మిగిలున్న నేపథ్యంలో ఆసీస్ కే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 215 పరుగులు చేయగా.. అరంగేట్రం ఆటగాడు ఆస్టన్ అగర్ (98) వీరోచిత బ్యాటింగ్ ప్రదర్శనతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 280 పరుగులు సాధించింది. 65 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆతిథ్య జట్టును కంగారూ బౌలర్లు స్టార్క్, అగర్ దెబ్బతీశారు.