: కమల్ రషీద్ ఖాన్ ను నిషేదించాలంటున్న బాలీవుడ్.. ట్విట్టర్ వివాదం


ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బాలీవుడ్ నటుడు, నిర్మాత కమల్ రషీద్ ఖాన్ ను ఆ సినీ ఇండస్ట్రీ నిషేధించాలంటోంది. ఇతనికి ట్విట్టర్లో 1.32 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎస్ఆర్కే గా పేరు పొందిన ఇతను ట్విట్టర్లో చేస్తున్న వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతున్నాయి. తాజాగా 35 ఏళ్లకు వచ్చేసిన సినీ హీరోలతో నటించనంటూ వ్యాఖ్యానించిన హుమా ఖురేషీ వ్యాఖ్యలకు ప్రతిగా, హుమా ఖురేషీతో శృంగారంలో పాల్గొనాలనుందంటూ వ్యాఖ్యానించి వివాదాన్ని రేపాడు. గతంలో బిపాసా బసు, కరీనాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి వివాదం రేపాడు. దీనికి తోడు ఈ మధ్యే రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'లూటేరా' సినిమా పరమ చెత్తగా ఉందంటూ ట్వీట్ చేశాడు.

దీనిపై బాలీవుడ్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. కానీ ఆతను మాత్రం అమితాబ్ కామెంట్ చేస్తే ఫీలవుతాను కానీ, ఎవరుపడితే వారు కామెంట్ చేస్తే పట్టించుకోనంటున్నాడు. అలాగే తానెవరికీ మౌత్ పీస్ ను కానని, సినిమాలు బాగున్నాయని ప్రచారం చేయడానికి తనకెవరూ డబ్బులివ్వడం లేదన్నారు. తనకు ఏదనిపిస్తే దాన్ని ట్వీట్ చేస్తానని, అంతేకానీ మిగిలిన వారి మనోభావాలకనుగుణంగా తాను నడుచుకోనన్నాడు. పబ్లిసిటీ కోసం రాకీ సావంత్, షెర్లీన్ చోప్రా, పూనమ్ పాండేలు పబ్లిసిటీ కోసం చేస్తున్న గిమ్మిక్కులు అందరూ చేయరని అంటున్నాడు.

  • Loading...

More Telugu News