: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పనిబడతాం: కోదండరాం
కోట్లాది మంది తెలంగాణ ప్రజలను నిరాశకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీ పనిబడతామని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. కోర్ కమిటీ భేటీపై కోదండరాం హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎలా ఒత్తిడికి గురిచెయ్యాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని దిగ్విజయ్ పేర్కొనడంపై స్పందిస్తూ.. విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దని సూచించారు. పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు తాము సాధించింది తక్కువ విజయమేమీ కాదంటూ.. తెలంగాణ తప్పక వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.