: తుస్సుమనిపించారు... ఎటూ తేల్చని కోర్ కమిటీ
ఉత్కంఠకు తెరదించారు. అయితే, తెలంగాణ సమస్యను మరికొంత కాలం పొడిగించారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనో, సమైక్యాంధ్రనే కొనసాగిస్తామనో స్పష్టీకరించకుండా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించి కీలక నిర్ణయాన్ని తీసుకుంటామని రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఈ సాయంత్రం ప్రధాని సమావేశంలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. అందరి వాదనలను పరిశీలించామని, రాష్ట్ర నేతలు రోడ్ మ్యాప్ లు సమర్పించారని వెల్లడించారు. సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించి తెలంగాణపై ప్రకటన చేస్తామని పేర్కొన్నారు.