: వెయ్యి రూపాయల్లేక మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే.. ఇది నిజాయతీకి ప్రతిఫలం!


నిజాయతీకి రోజుల్లేవని మరోసారి నిరూపితమైంది. డబ్బు సంపాదన కంటే నిజాయతీకి పెద్దపీట వేసినందుకు దుర్భరజీవనం ప్రతిఫలంగా దక్కింది. ఈ క్రమంలో అంతిమంగా నిజయతీ ఓటమిపాలైంది. కేవలం రక్త పరీక్షకు డబ్బుల్లేక మాజీ ఎమ్మెల్యే ఒకరు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన భగవతీ దుర్గా ప్రసాదరావు(70) హెర్నియాతో బాధ పడుతూ ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు. గాంధేయవాదిగా పేరొందిన ఆయన, రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసి నిజాయతీకి మారుపేరుగా నిలిచారు. చిల్లిగవ్వకూడా వెనకేసుకోలేదు. హెర్నియాతో బాధపడుతున్న ఆయనకు రక్తమార్పిడీ చేయించాల్సి ఉంది. అందుకు రక్తం ఆయన కుమారులిస్తున్నా రక్త పరీక్షకు వెయ్యి రూపాయలు కావాలి. కానీ, వారి కుమారుల దగ్గర 300 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దీంతో అతనికి రక్తపరీక్ష నిర్వహించేందుకు నిరాకరించారు. అంతే కాదు, అతని దగ్గర డబ్బులేదని ప్రభుత్వాసుపత్రిలో కూడా చేర్చుకోలేదట. సమయానికి రక్తం అందక ఆయన మృతి చెందారు. వారి వద్ద అంత్యక్రియలకు కూడా డబ్బు లేకపోవడంతో గ్రామస్థులు చందాలు వేసుకుని అంత్యక్రియలు జరిపారు.

  • Loading...

More Telugu News