: కిషన్ గంగ నీటి వినియోగానికి భారత్ కు హక్కు ఉంది: ఐసిఎ


భారత్- పాక్ సరిహద్దుల్లో మనదేశం చేపట్టిన కిషన్ గంగ జలవిద్యుత్ కేంద్రానికి నీలం నది నీటిని వినియోగించుకోవచ్చని నెదర్లాండ్స్ లో ఉన్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు (ఐసిఎ) తెలిపింది. భారత్ -పాక్  దేశాల మధ్య ఉన్న నీలం నదిపై భారత్ ఈ ప్రాజెక్టు చేపట్టింది.

1960లో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన సింధు జల ఒప్పందం ప్రకారం.. భారత్ నిరభ్యంతరంగా కిషన్ గంగ నీటిని జలవిద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకోవచ్చని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు చెప్పింది.

అయితే పాకిస్థాన్ వ్యవసాయ ప్రయోజనాలకు భంగం కలగకుండా చూడాలని కోర్టు భారత్ కు సూచించింది. నీటి వినియోగంపై తుది తీర్పును త్వరలోనే వెల్లడిస్తామని కోర్టు తెలిపింది.

  • Loading...

More Telugu News