: ప్రజా ప్రతిఘటన దళం కథ కంచికి
ప్రజా ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి మోహనన్న వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు ఎదుట శుక్రవారం మధ్యాహ్నం లొంగిపోయారు. రఘుపతి అలియాస్ మోహనన్నతోపాటు మరో ముగ్గురు లొంగిపోయారు. వారి వద్ద నుంచి ఏకే 47 తుపాకులు, రివాల్వర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ప్రజాప్రతిఘటన దళం లేదని డీఐజీ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు.