: కారెక్కనున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యే?


తెలుగుదేశం పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే వలసబాట పట్టేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ శాసనసభ్యుడు వేణుగోపాలాచారి త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రోజు వేణుగోపాలాచారి భైంసాలో తన అనుచరులతో సమావేశం కావడం పార్టీ మారే విషయాన్ని నిర్ధారిస్తోంది. గతకొన్నాళ్ళుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఈయనపై ఇటీవలే టీడీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. వేణుగోపాలాచారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. ఈ రెబల్ ఎమ్మెల్యే కాంగ్రెస్, బీజేపీ లలో ఏదో ఒకదాంట్లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ, తెలంగాణ కోసం పోరుబాట పట్టిన ఈ ముథోల్ శాసనసభ్యుడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News