: రూ.100కోట్ల చిత్రాలన్నీ గొప్పవేం కావు: జాన్ అబ్రహాం


100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసిన చిత్రాలన్నీ గొప్పవేమీ కావని నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం అన్నారు. జాన్ అబ్రహాం స్వీయ నిర్మాణ సంస్థ జేఏ ఎంటర్ టైన్ మెంట్ 'మద్రాస్ కేఫ్' చిత్రం కోసం సన్ ఫిల్మ్స్ తో జతకట్టింది. ఈ చిత్రం ట్రైలర్ ను ముంబైలో నిన్న సాయంత్రం విడుదల చేశారు. అనంతరం జాన్ మాట్లాడుతూ.. ఇది చాలా సీరియస్ ఫిల్మ్ అని చెప్పారు. నాణ్యమైన చిత్రాలనే తీస్తున్నామని, ఈ చిత్రం కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసేది తెలియదన్నారు. తన అభిప్రాయం ప్రకారం 100 కోట్ల రూపాయలతో తీసిన చిత్రాలన్నీ గొప్పవేమీ కావని అన్నారు.

  • Loading...

More Telugu News