: నోకియా పవర్ ఫుల్ కెమెరా ఫోన్
41 మెగాపిక్సల్స్ కెమెరాతో నోకియా లుమియా 1020 ఫోన్ ను న్యూయార్క్ లో ఆవిష్కరించింది. ఇందులో ఇమేజెస్ కోసం గ్జినాన్ ఫ్లాష్, వీడియోల కోసం ఎల్ ఈడీ ఫ్లాష్ ను ఏర్పాటు చేశారు. జీస్ ఆప్టిక్స్ సిక్స్ ఫిజికల్ లెన్సెస్, ముందు భాగంలో 1.2 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల కోసం 5 మెగా పిక్సల్స్ రిజల్యూషన్ తో ఫోటోలు తీసుకోవచ్చు. అదే సమయంలో ఎడిటింగ్ కోసం 38 మెగాపిక్సల్స్ హై రిజల్యూష్ తో ఫొటోలు తీసుకోవడానికి మరో ఆప్షన్ కూడా ఉంది. విండోస్ 8తో నడిచే ఇందులో 4.5 అంగుళాల టచ్ స్క్రీన్, 1.5 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 32 గిగాబైట్ ఇంటర్నల్ మెమొరీ, 2జీబీ ర్యామ్, ఇంటర్నెట్ ద్వారా 7జీబీ క్లౌడ్ స్టోరేజీ తదితర సదుపాయాలు కూడా ఉన్నాయి. దీనికి 300 డాలర్లుగా ధరను నిర్ధారించింది. ప్రస్తుతానికి భారత మార్కెట్ కు ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు.