: సత్తా చాటిన మన కుర్రాళ్లు... ముక్కోణపు వన్డే సీరీస్ మనదే!


ప్రపంచానికి భారత్ మరోసారి తన సత్తా చాటింది. వన్డే క్రికెట్లో తనకు తిరుగులేదని ఇంకోసారి రుజువు చేసింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచి, ముక్కోణపు సిరీస్ ను తన సొంతం చేసుకుంది. నువ్వా? నేనా? అన్న రీతిలో సాగిన ఫైనల్ మ్యాచ్ లో ఒక వికెట్ తేడాతో శ్రీలంకను భారత్ చిత్తు చేసింది. ధోనీ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, తన జట్టుకు విజయాన్ని, దేశానికి గౌరవాన్ని తీసుకొచ్చాడు. 202 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్, 49.4 ఓవర్లలో మరో వికెట్ చేతిలో ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది.

శ్రీలంక మొదటి నుంచీ కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో కట్టడి చేసినప్పటికీ మన కుర్రాళ్ళను ఆపడం వారి తరం కాలేదు. ముఖ్యంగా చివరి ఓవర్ అందరికీ విపరీతమైన టెన్షన్ పట్టించింది. ఆ ఓవర్లో 15 పరుగులు చేయాల్సివుండగా, కెప్టెన్ ధోనీ రెచ్చిపోయి రెండు సిక్సులూ, ఒక ఫోరూ బాదేసి, మరో రెండు బంతులు ఉండగానే విజయాన్ని అందించి, 'నీ దూకుడూ... సాటెవ్వరూ' అనిపించుకున్నాడు. రోహిత్ శర్మ 58, ధోనీ 45, రైనా 32 పరుగులతో రాణించారు. ధోనీ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకోగా, భువనేశ్వర్ కుమార్ 'మ్యాన్ ఆఫ్ ది సీరీస్' అవార్డు గెలుచుకున్నాడు.

  • Loading...

More Telugu News