: మలయాళ చిత్రంలో శ్రీశాంత్


కేరళ ఎక్స్ ప్రెస్ బౌలర్ శ్రీశాంత్ కు సినిమాలంటే పిచ్చి అన్న సంగతి తెలిసిందే. శ్రీశాంత్.. సినీ తారలతో జల్సాలకు అవసరమైన కాసుల కోసమే ఇటీవలే స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి.. ఎట్టకేలకు బెయిల్ పై బయటికొచ్చాడు. త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్న ఈ పేస్ బౌలర్ ఇప్పుడు మలయాళ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడు. 'బిగ్ పిక్చర్' అనే ఈ చిత్రానికి బాలచంద్ర కుమార్ దర్శకుడు. శ్రీశాంత్ కు ఇదే తొలి చిత్రం కాదు. ఇంతకుముందు 'మాజవిల్లనాట్టం వారే' అనే చిత్రంలోనూ గెస్ట్ రోల్ లో తళుక్కుమన్నాడు.

  • Loading...

More Telugu News