: లేడీ కిలాడీ అరెస్టు
సంతకాలు ఫోర్జరీ చేసి 17 లక్షలు మింగేసిన లేడీ కిలాడీని పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గ్రామీణ నీటిసరఫరా శాఖలో ఉద్యోగినిగా పనిచేస్తూ, దొంగ సంతకాలతో 17 లక్షల రూపాయలను పక్కదారి పట్టించిన సీతామహాలక్ష్మి అనే ఉద్యోగినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాపరిషత్ నుంచి ఆర్ డబ్ల్యూఎస్ కు ఆమె డిప్యుటేషన్ పై వచ్చారు. సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ వివిధ అభివృద్ధి పనులను చూసే ఈఈ సంతకాన్ని ఫోర్జరీ చేసి 17 లక్షల రూపాయలను ఆమె పక్కదారి పట్టించిన విషయాన్ని అధికారులు గుర్తించారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు.