: బైక్ నేర్చుకుంది సినిమాల్లోకి వచ్చాకే: రానా
యువ హీరో దగ్గుబాటి రానా తాను సినిమాల్లోకి వచ్చాకే బండి నడపడం నేర్చుకున్నానని వెల్లడించాడు. కొత్త వెస్పా బైక్ ను హైదరాబాద్ లో నేడు ఆవిష్కరించిన రానా ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు. హైదరాబాద్ ఫ్యాషన్ కు తగిన బైక్ గా వెస్పాను అభివర్ణించాడు. ఇక తన హైటుకు సరిపోయే బైక్ నడపడాన్ని ఆస్వాదిస్తానని తెలిపాడు. తాజాగా రాజమౌళి భారీ చిత్రం బాహుబలిలో ప్రతినాయక పాత్ర పోషిస్తున్న రానా.. ఆ సినిమాలో హీరోగా నటిస్తున్న ప్రభాస్ పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రభాస్ తో పరిచయం కొద్దికాలంలోనే స్నేహంగా మారిందని తెలిపారు.