: తెలంగాణపై మెలికపెట్టిన దిగ్విజయ్
తెలంగాణ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ కొత్త మెలిక పెట్టారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలంటే రాజ్యాంగ సవరణ అవసరమంటూ, రాష్ట్ర విభజన అంశం ఇప్పట్లో తేలేదికాదని పరోక్షంగా చెప్పారు. నేడు పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో దిగ్విజయ్ ఈ విషయం వెల్లడించారు. తెలంగాణ విషయమై యూపీఏ భాగస్వామ్య పక్షాలనూ సంప్రదించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణపై సందిగ్ధత తొలగిస్తామని మాత్రమే చెప్పానని, ప్రత్యేక రాష్ట్రంపై హామీ ఇవ్వలేదని దిగ్విజయ్ స్పష్టం చేశారు.