: ఉండవల్లికి అంబటి కౌంటర్
రాజమండ్రి సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు గుప్పించిన ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు అంబటి రాంబాబు ఘాటుగా బదులిచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై అనుమానాలున్నాయని జగన్ పార్టీ అనడం అనైతికమని నిన్న ఉండవల్లి చేసిన వ్యాఖ్యలను అంబటి తప్పుబట్టారు. హైదరాబాద్ లో నేడు మీడియా సమావేశం నిర్వహించిన అంబటి.. రాజమండ్రి ఎంపీపై నిప్పులు చెరిగారు. ఉండవల్లి దిగజారుడుతనం చూస్తుంటే జాలేస్తోందని వ్యాఖ్యానించారు.
రాజకీయభవిష్యత్తునిచ్చిన వైఎస్ పై కాంగ్రెస్ మంత్రులు ఆరోపణలు చేస్తుంటే ఉండవల్లి ఏం చేస్తున్నారని అంబటి ప్రశ్నించారు. ఉండవల్లి నమ్మకద్రోహిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోనియా అల్లుడు వాద్రా, కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, వివేక్ వంటి వారికి వ్యాపారాలున్నాయని, వారి ఆస్తులపై చర్చించేందుకు ఉండవల్లి సిద్ధమా? అని అంబటి సవాల్ విసిరారు.