: హృతిక్ రోషన్ డిశ్చార్జ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఈ రోజు ముంబయ్ లోని హిందూజా ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు. శస్త్రచికిత్స అనంతరం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆయన ఆసుపత్రి బయట మీడియాకు వెల్లడించారు. రెండు నెలల క్రితం 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమాలో పోరాట సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా హృతిక్ తలకు గాయమైంది. అప్పట్నుంచి చికిత్స తీసుకుంటున్నా హృతిక్ కు ఉపశమనం కలగకపోవడంతో ఆదివారం ఆయన తలకు శస్త్రచికిత్స చేశారు. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు హృతిక్ కు సూచించారు.