: రోడ్ మ్యాప్ లు అందిన తరువాతే తుది నిర్ణయం: దిగ్విజయ్ సింగ్


రోడ్ మ్యాప్ లు అందిన తరువాతే తెలంగాణపై తుది నిర్ణయం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో సీమాంధ్ర మంత్రులతో భేటీ అయిన తరువాత ఆయన మాట్లాడుతూ సీఎం, డిప్యుటీ సీఎం, పీసీసీ చీఫ్ మార్గసూచీలను అందించనున్నారని, ఆ వివరాలు అందిన తరువాతే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ, సమైక్యరాష్ట్రం మినహా మరే నిర్ణయాన్నయినా వ్యతిరేకిస్తామని దిగ్విజయ్ కు స్పష్టం చేశామన్నారు. ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలని దిగ్విజయ్ కు సూచించామన్నారు.

  • Loading...

More Telugu News