: కోర్ కమిటీ భేటీతో ఏమీ తేలదు: రాఘవులు


తెలంగాణ అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ తర్వాతైనా స్పష్టత వస్తుందన్న నమ్మకం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలో సమావేశాల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజన అంశంపై ఏదో ఒకటి తేల్చకపోతే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి నోరున్నట్టు లేదని, ఉంటే, నోరు విప్పి ఏదో విషయం చెప్పాలని రాఘవులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News