: బెంగాల్ పంచాయతీ జగడం


పశ్చిమ బెంగాల్ పంచాయతీ తొలివిడత ఎన్నికల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయి. బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్, పురులియా, బాన్కురా జిల్లాల్లో 10,200 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 75 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా పశ్చిమ మిడ్నాపూర్ లో తృణముల్ కాంగ్రెస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 11 మంది కార్యకర్తలు గాయాలపాలయ్యారు. మిడ్నాపూర్ లోని మరో పోలింగ్ కేంద్రం వద్ద సీపీఎం నేత సూర్యకాంత మిశ్రా ఓటువేసి తృణముల్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు.

  • Loading...

More Telugu News