: సోనియా ఏ-1 దోషి: నాగం


తెలంగాణ ఆత్మ బలిదానాల్లో ఏ-1 దోషి సోనియా గాంధీ అని బీజేపీ నేత నాగం జనార్ధన రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ 12న సమావేశం కానున్న కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాలను కాంగ్రెస్ పార్టీయే నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే నరేంద్ర మోడీ ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News