: నిర్భయ అత్యాచారం కేసు తొలి తీర్పు 25కు వాయిదా


ఢిల్లీలో గత ఏడాది డిసెంబరులో వైద్య విద్యార్ధిని నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో తొలి తీర్పు నేడు వెలువడనుంది. ఘటనకు పాల్పడిన ఐదుగురు దుర్మార్గుల్లో ఒకడు బాల నేరస్థుడు(17 ఏళ్లు) కావడంతో అతడి విచారణ విడిగా సాగింది. రెండ్రోజుల ముందే ఆ కేసు విచారణ కూడా ముగియడంతో అతడికి ఏ శిక్ష విధించాలన్నది జువైనల్ బోర్డు నిర్ణయిస్తుంది. అయితే ఇతనికి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా జరిగిన నేరంలో అత్యంత క్రూరుడు వాడేనని పోలీసులు చెబుతున్నారు. మిగిలిన నిందితులు కూడా వాడ్నే వేలెత్తి చూపారు. ఈ నేపథ్యంలో వాడికి తక్కువ శిక్ష పడితే ఆందోళనలు మరోసారి మిన్నంటే అవకాశముంది.

మృతురాలి తల్లిదండ్రులు మాత్రం వాడ్ని బాలుడిగా గుర్తించవద్దని, సాధారణ నేరస్తుడిగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేకపోయింది. మన చట్టం 18 ఏళ్లు నిండని వారిని బాలనేరస్ధులుగా పరిగణిస్తుంది. ఏది ఏమైనా, తుది తీర్పు ఎలా ఉండనుందోనని దేశప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ జువైనల్ కోర్టు ఈ తీర్పును 25కు వాయిదా వేసింది. విచారణ పూర్తయిన సందర్భంగా కేసును రిజర్వులో ఉంచిన న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెలువరుస్తుందని ఎంతో ఆశగా అందరూ ఎదురు చూశారు. కానీ కోర్టు 25 కు తీర్పును వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News