: హృతిక్ రోషన్ విరాళం 25 లక్షలు


ఉత్తరాఖండ్ వరద బాధితులకు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కష్టాలలో ఉన్నవారికి తప్పకుండా సాయం అందించాలని అన్నారు. ఒకరు మార్గదర్శకంగా నిలిస్తే నలుగురు ముందుకు వస్తారని విరాళం ప్రకటించిన అనంతరం హృతిక్ అన్నారు. అందరికంటే ముందుగా విరాళాన్ని ప్రకటించడమే కాకుండా బాధితుల కోసం విరాళాలను సేకరిస్తున్న అమీర్ ఖాన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టుకుపోవడంతో హృతిక్ రోషన్ మూడు రోజుల క్రితం ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. సర్జరీ చేయించుకోవడానికి వెళ్లే ముందు హృతిక్ రోషన్ తన వంతు విరాళాన్ని చెక్ రూపంలో అమీర్ ఖాన్ కు పంపించారు.

  • Loading...

More Telugu News