: నోయిడాలో హింసాత్మకంగా మారిన సార్వత్రిక సమ్మె


దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె నోయిడా ప్రాంతంలో హింసాత్మకంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని నోయిడాలోని పలు కర్మాగారాలపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. దీంతో కొన్ని కార్యాలయాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి.

అక్కడి కార్లు, ద్విచక్ర వాహనాలను కూడా 
 ఆందోళనకారులు దగ్ధం చేశారు. మరోవైపు సమ్మె ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు ప్రయాణీకుల నుంచి అధిక మొత్తం వసూలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News