: వేపతో క్యాన్సర్‌కు చెక్‌ చెప్పవచ్చు


వేపలో పలు ఔషధ గుణాలున్నాయి. ఇది అనాదిగా మన వైద్యంలో ప్రధానంగా ఉపయోగించబడుతోంది. వేపను ఇటు మనుషులకే కాదు, అటు పంటల్లో కూడా కీటకనాశినిగా కూడా ఉపయోగిస్తారు. ఇదే వేపని క్యాన్సర్‌ వ్యాధికి చికిత్సలో కూడా ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు.

చిత్తరంజన్‌ నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎన్‌సీఐ)కి చెందిన పరిశోధకుల బృందం ఈ విషయాన్ని గుర్తించింది. వేపాకుల నుండి తీసిన 'నీమ్‌ లీఫ్‌ గ్లైకోప్రోటీన్‌-ఎన్‌ఎల్‌జీపీ' అనే ప్రోటీన్‌ క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకుంటున్నట్టు వీరి పరిశోధనలో బయటపడింది. ఈ ప్రోటీన్‌ నేరుగా క్యాన్సర్‌ కణాలను నిర్వీర్యం చేసే దిశగా కాకుండా కణితిలోని రోగ నిరోధక కణాలను బలోపేతం చేయడం ద్వారా క్యాన్సర్‌ నివారణకు దోహదపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అలాగే కణితికి చుట్టుపక్కల ఉండే రక్తం వంటి ఇతర వ్యవస్థలను కూడా ఈ ప్రోటీన్‌ మారుస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ విధంగా వేపలోని ప్రోటీన్‌ రోగ నిరోధక కణాలను బలోపేతం చేయడం ద్వారా క్యాన్సర్‌ కణాలను నిర్వీర్యం చేస్తుందని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News