: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే సాయిరాజ్ వైఎస్సార్సీపీలో చేరిక


తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే సాయిరాజ్ నేడు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు.

సాయిరాజ్ కొద్ది రోజుల క్రితం జైల్లో జగన్ ను కలవడంతో టీడీపీ ఆయనపై సస్సెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు విజయమ్మను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, ఎమ్మెల్యే కృష్ణదాసు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News