: 'టూర్ డి ఫ్రాన్స్' రేసులో అభిమాని వికృత చర్య!


ప్రపంచస్థాయి సైక్లిస్టులు ప్రతిష్ఠాత్మకంగా భావించే టూర్ డి ఫ్రాన్స్ రేసులో ఓ అభిమాని వికృత చర్యకు పాల్పడ్డాడు. బ్రిటీష్ సైక్లింగ్ స్టార్ మార్క్ కావెండిష్ పై మూత్రం ఉన్న సీసాను విసిరాడు. ఫ్రాన్స్ లోని నార్మండీ వద్ద జరుగుతున్న ఈ రేసులో 33వ కిలోమీటర్ వద్ద ఈ ఘటన జరిగింది. అభిమాని ఆగ్రహానికి కారణం ఏమిటంటే.. నిన్న జరిగిన ప్రాథమిక రౌండ్ పోటీలో కావెండిష్.. న్యూజిలాండ్ సైక్లిస్టును తన సైకిల్ తో ఢీకొట్టడమే. ఈ సంఘటనలో వీలర్స్ కిందపడిపోయాడు. ఆ సమయంలో సదరు దురభిమాని కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. వీలర్స్ రేసునుంచి తప్పుకోవడానికి కావెండిష్ కారణమని భావించిన అతగాడు ఈ ఉదయం, మూత్రం నింపిన బాటిల్ ను కావెండిష్ పై విసిరి తన కోపం చల్లార్చుకున్నాడు. కాగా, ఈ ఘటనపై కావెండిష్ ప్రాతినిధ్యం వహిస్తున్న 'టీమ్ ఓమెగా' తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News