: డీసీ యజమాని ఇళ్లలో పూర్తయిన సోదాలు
కెనరాబ్యాంకు మోసం కేసులో డీసీ చైర్మన్ వెంకట్రామి రెడ్డి ఇళ్లలో సీబీఐ సోదాలు పూర్తి చేసింది. చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ రవి వినాయకరెడ్డి, ఎండీ అయ్యర్ లపై బెంగళూరులో కేసులు నమోదయ్యాయి. దీంతో నాంపల్లి 14 వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ అనుమతితో నిందితుల ఇళ్లు, ఆడిటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపి, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. వీటిని సీబీఐ నాంపల్లి కోర్టుకు సమర్పించింది. తదుపరి దర్యాప్తు కోసం అనుమతి కోరింది.