: బొత్స.. కుటుంబ పెద్దట!
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ప్రస్తుతం తాను కుటుంబ పెద్దనంటున్నారు. విభజన కోరుకునేవారికి కలిసి ఉందామని చెబుతూ కుటుంబ పెద్దలా బాధ్యతగా వ్యవహరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మంత్రి శైలజానాథ్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధిష్ఠానం సమైక్య, విభజన అంశాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఇవ్వమని కోరిందని, తాను ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నానని బొత్స తెలిపారు. ఇక అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉన్నా గౌరవించాల్సిందే అని ఆయన పార్టీ వర్గాలకు ఉద్బోధించారు. తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని బొత్స ఇంతకుముందు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!