: నేరచరితులు రాజకీయాలకు అనర్హులు.. సుప్రీం సంచలన తీర్పు
రాజకీయాల్లో నేరచరితుల మనుగడపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాజకీయ నాయకులు నేరచరితులని తేలితే వారిపై అనర్హత వేటు తప్పదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అనర్హత వేటు నుంచి ప్రజాప్రతినిధులు తప్పించుకునే వెసులుబాటును కల్పిస్తున్న నిబంధన సరికాదని, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో అనర్హత నుంచి తప్పించుకునే నిబంధన న్యాయ సమ్మతం కాదని తేల్చి చెప్పింది. అప్పీల్ పెండింగ్ లో ఉన్నంత వరకు ప్రజాప్రతినిధులు అర్హులే అనే నిబంధన తప్పని చెప్పింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని8(4) నిబంధన న్యాయసమ్మతం కాదని తెలిపింది. తీర్పు వెలువడక ముందే దోషులైన ప్రజాప్రతినిధులు అప్పీలుకు వెళితే అనర్హత వర్తించదని సుప్రీంకోర్టు తెలియజేసింది. క్రిమినల్ కేసుల్లో ప్రజాప్రతినిధులు దోషులుగా తేలితే ఎన్నికల్లో పోటీ నుంచి నిషేధించాల్సిందేనని పేర్కొంది.