: దొంగలకు అడ్డా వైఎస్సార్ సీపీ: వీహెచ్, రేవంత్ రెడ్డి


దొంగలకు, హంతకులకు వైఎస్సార్ సీపీ అడ్డాగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, టీడీపీ నేత రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజమండ్రి ఏటీఎంల నగదు నిర్వాహకుడి హత్యా కేసు నిందితులు వైఎస్సార్ సీపీ నేతలేనన్న పోలీసుల వ్యాఖ్యలపై వీరిద్దరూ హైదరాబాద్ లో స్పందించారు. హంతకులు, దోపిడీ దారులు, నకిలీ నోట్ల ముఠాలకు ఓ పార్టీ ఉందని వైఎస్సార్ సీపీ నిరూపించిందన్నారు. హంతకులు, రౌడీలే ఆ పార్టీలో ఉన్నారన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలని వారు కోరారు. జైలు నుంచే జగన్ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారని అభిప్రాయపడ్డారు. షర్మిళ పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్న నేతలపై పోలీసులు నిఘా పెట్టాలని వారు సూచించారు. ద్వారంపూడి వందల కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తారో బయటపెడతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News