: యూరప్ లో యువరాజ్ కసరత్తులు


భారత క్రికెట్ మన్మథుడు యువరాజ్ సింగ్ తిరిగి జట్టులోకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 2011 వరల్డ్ కప్ అనంతరం కేన్సర్ బారిన పడి క్రమంగా టీమిండియాకు దూరమైన యువరాజ్ మళ్ళీ జట్టులోకొచ్చినా స్థానం నిలుపుకోలేకపోయాడు. యువ ఆటగాళ్ళ జోరుతో ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ కు బెర్త్ కరవైంది. యువీ చివరిసారిగా జనవరిలో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్ లో పెద్దగా రాణించకపోవడంతో సెలెక్టర్ల వేటు నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో చోటు కోసం కసిగా సాధన చేస్తున్నాడు. అందుకు ప్రత్యేకంగా విదేశీ శిక్షకుడిని నియమించుకున్న యువీ.. తన సాధనకు వేదికగా ఫ్రాన్స్ ను ఎంచుకున్నాడు.

కొన్నాళ్ళక్రితం వరకు భారత బౌలింగ్ విభాగానికి పెద్దదిక్కుగా నిలిచిన జహీర్ ఖాన్ కూడా యువీకి జతగా ఫ్రాన్స్ లోని బ్రైవ్-లా-గైలార్డే పట్టణంలో ఫిట్ నెస్ కోసం శిక్షణ పొందుతున్నాడు. ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫిజికల్ ట్రయినర్ టిమ్ ఎక్స్ టెర్ శిక్షణలో వీరిద్దరూ చెమటోడ్చుతున్నారు. ఈ విషయమై యువరాజ్ మాట్లాడుతూ.. ఫిట్ నెస్ సాధించడమే తన ప్రథమ లక్ష్యమని చెప్పాడు. ఆ దిశగా జహీర్ తో కలిసి తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలిపాడు. ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ, విండీస్ లో ముక్కోణపు సిరీస్, తాజాగా జింబాబ్వే సిరీస్ కు ఎంపిక చేసిన భారత జట్టులో యువీ, జహీర్ కు సెలక్టర్లు మొండిచేయి చూపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News