: రోడ్ మ్యాప్ తయారీలో బొత్స బిజీ


తెలంగాణపై రోడ్ మ్యాప్ తయారు చేసే పనిలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ బిజీగా గడుపుతున్నారు. మంత్రులు, ముఖ్య నేతల అభిప్రాయలను సేకరిస్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత మంత్రులు, ముఖ్య నేతల అభిప్రాయలతో తన మ్యాప్ ను అధిష్ఠానానికి సమర్పించనున్నారు. ఈ రోడ్ మ్యాప్ తో రేపు ఉదయం బొత్స ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 12 న కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి రెండు ప్రాంతాల నేతలను కాంగ్రెస్ పార్టీ రాజధానికి ఆహ్వానించిన నేపథ్యంలో ముందుగానే బొత్స తన రోడ్ మ్యాప్ ను అధిష్ఠానానికి అందజేయనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News