: వరల్డ్ కప్ కు అర్హత సాధించిన ఐర్లాండ్
ఐసీసీ 2015 వరల్డ్ కప్ కు ఐర్లాండ్ అర్హత సాధించింది. దీంతో ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ సమరంలో పాల్గొననుంది. నెదర్లాండ్ లోని అమ్ స్టెల్వీన్ లో నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ టై కావడంతో చాంపియన్ షిప్ ఐర్లాండ్ సొంతమైంది. 20 పాయింట్లతో ఐర్లాండ్ వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ కు అర్హత సంపాదించింది.