: నిజమే... నాకు కొడుకు పుట్టాడు: షారూక్ ఖాన్


సరోగసీ (అద్దెగర్భం) ద్వారా తనకు బాబు పుట్టిన విషయాన్ని నటుడు షారూక్ ఖాన్ ధ్రువీకరించాడు. అతడి పేరు అబ్రం అని చెప్పాడు. నెలలు నిండకముందే బాబు పుట్టాడని, అతడు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడని షారూక్ మీడియాకు తెలిపారు. ఇన్నాళ్లూ మీడియాలో వస్తున్న వార్తలపై నోరు విప్పకుండా ఉండడానికి కారణమిదేనని చెప్పాడు. అతడి అనారోగ్య సమస్యల గురించిన ఆందోళనలో ఉన్నామని తెలిపాడు.

ఎటువంటి లింగ నిర్ధారణ పరీక్షలనూ నిర్వహించలేదని, వీటిపై వచ్చిన వార్తలన్నీ నిజం కావని స్పష్టం చేశాడు. సరోగసీ విధానంలో బిడ్డకు జన్మనిచ్చేందుకు వైద్య సాయం అందించిన డాక్టర్లందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. షారూక్, గౌరీల నుంచి సేకరించిన అండాలను వేరొక మహిళ గర్భంలో ప్రవేశపెట్టగా.. ఆమె ద్వారా షారూక్, గౌరీలు మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. ఈ విధానాన్నే సరోగసీ అంటారు.

  • Loading...

More Telugu News