: క్రమంలేని నిద్రతో మేధస్సుకు చేటు!


చిన్నపిల్లల్లో ఒక క్రమం అంటూ లేకుండా నిద్రపోవడం వల్ల వారి మేధస్సుకు నష్టం కలుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇలా ఒక వేళ అంటూ లేకుండా నిద్రపోయే చిన్నపిల్లల్లో దాని ప్రభావం వారి మేధస్సుపై పడుతుందని, వారి మేధోసామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

చిన్నపిల్లలు ఒక నిర్ధిష్టమైన సమయంలో నిద్రపోవడం అనేది జరగకుంటే దాని వల్ల వారి శరీర లయ దెబ్బతింటుంది, ఇది నిద్రలేమికి దారితీస్తుంది. దీని ఫలితంగా మెదడులోని ప్లాస్టిసిటీకి, సమాచారాన్ని ప్రోదిచేసి, పదిలపరచుకునే సామర్ధ్యానికి విఘాతం కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. చిన్నతనంలో మనలో చోటుచేసుకునే వృద్ధి అనేది జీవితాంతం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, కాబట్టి నిద్ర తగ్గడం, అడ్డంకులతో కూడిన నిద్ర అనేది కూడా మన జీవితాంతం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎదుగుదలకు సంబంధించిన కీలక దశల్లో గనుక ఇలా జరిగితే ఇది వారి జీవితాల్లో మరీ ఇబ్బందికరంగా మారుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనకు కొందరు చిన్నారులను ఎంపిక చేసుకున్నారు.

వీరిలో 3,5,7 వయసున్న వారి జీవన విధానాన్ని పరిశీలించారు. వారు ఎన్ని గంటలకు నిద్రపోతున్నారు? నిద్ర పోయేందుకు తరచూ ఎలాంటి సమయాన్ని పాటిస్తున్నారు? ఇది వారి మేధస్సు పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే అంశాలను శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో విశ్లేషించారు. ఈ పరిశీలనలో ఏడేళ్లు వచ్చేసరికి సగంకన్నా ఎక్కువ మంది చిన్నారులు క్రమం తప్పకుండా 7.30 గంటలనుండి 8.30 గంటల మధ్య నిద్రకుపక్రమిస్తున్నట్టు తేలింది. కాబట్టి నిద్ర క్రమం తప్పితే దాని వల్ల మేధా శక్తి తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News