: చైనా మంత్రికి మరణశిక్షపై పెదవి విరుస్తున్న నెటిజన్లు
రైల్వే శాఖ మంత్రిగా వ్యవహరించిన కాలంలో భారీగా అక్రమార్జనకు పాల్పడిన లియు ఝిజున్ కు కోర్టు మరణశిక్ష విధించినా.. అమలుకు రెండేళ్ళ వ్యవధినివ్వడాన్ని చైనాలోని నెటిజన్లు, మేధావులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ళ అనంతరం ఈ శిక్షపై సమీక్షించి దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తారని, ఇలాంటి వెసులుబాటుతో కూడిన శిక్షలు విధించడం వల్ల సమాజంలో మార్పు ఎలా వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.
లియుకు మరణశిక్ష విధించడంపై చైనాలో ఎవరికీ ఆశ్చర్యం కలగలేదని అక్కడి నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. త్వరలోనే దాన్ని మామూలు శిక్షగా మార్చేస్తారని వారు అభిప్రాయపడ్డారు. 2003-2011 మధ్య కాలంలో లియు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రూ.65 కోట్ల మేర ముడుపులు స్వీకరించినట్టు విచారణలో వెల్లడైంది. దాంతో ఆయనకు బీజింగ్ కోర్టు ఉరిశిక్ష విధించింది.