: జి కొండూరులో కాల్పులకు దారితీసిన రామకృష్ణ మృతి పై విచారణ


కృష్ణా జిల్లా కోడూరు గ్రామంలో ఎస్సైపై దాడి, గ్రామస్థులపై సీఐ కాల్పులకు దారితీసిన రామకృష్ణ మృతిపై తహశీల్దార్ విచారణ చేపట్టారు. మృతుడు రామకృష్ణ నివాసంలో జి. కొండూరు మండల తహశీల్దార్ జిడ్యోము విచారణ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రామకృష్ణ మృతి, పోలీస్ స్టేషన్ పై దాడి, సీఐ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు అందించారు. వీటిని తహశీల్దారు నమోదు చేసుకున్నారు. రామకృష్ణ, గ్రామంలోని వివాహితతో లేచిపోయాడన్న అనుమానంతో ఆమె బంధువులే అతన్ని హత్య చేశారని, వారికి పోలీసులు సహకరించారనీ మృతుడి బంధువులు రాస్తారోకో చేయగా .... వీరిపై పోలీసులు మండిపడ్డారని, దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు పోలీసులపై దాడికి పాల్పడ్డారని గ్రామస్థులు తెలిపారు. ఆ తరువాత మండల కేంద్రం నుంచి వచ్చిన సీఐ ప్రైవేటు వ్యక్తులతో దాడి చేసి కాల్పులకు తెగబడ్డాడని వివరించారు.

  • Loading...

More Telugu News