: డెక్కన్ క్రానికల్ చైర్మన్ పై సీబీఐ కేసు
బ్యాంకును తప్పుదోవ పట్టించారంటూ డెక్కన్ క్రానికల్ పత్రిక చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2009లో నకిలీ పత్రాలతో రుణం తీసుకుని కెనరా బ్యాంకును మోసం చేశారని, సీబీఐ.. వెంకట్రామిరెడ్డిపై ఐపీసీ 120 బి, 420, 468, 471 సెక్షన్ల కింద వెంకట్రామిరెడ్డితో పాటు వైస్ చైర్మన్ టి.వినాయక్, ఎండీ రవిరెడ్డిపై నేడు కేసు నమోదు చేసింది. రూ.1230 కోట్ల మేర బ్యాంకుకు టోకరా వేశారని ఆరోపించిన సీబీఐ.. ఆ రుణాలను సైతం తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని పేర్కొంది. వెంకట్రామిరెడ్డి నివాసంలో బెంగళూరు నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం నిన్న రాత్రి సోదాలు జరిపిన సంగతి తెలిసిందే.