: ఐస్ క్రీం కొనిస్తామని చెప్పి, అత్యాచారం చేశారు!


ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఐస్ క్రీం కొనిస్తామని చెప్పి ముగ్గురు కామాంధులు ఆదివారం రాత్రి ఓ బాలికను బలాత్కరించారు. ఇక్కడి లిసారి గేట్ వద్ద నివాసముండే 13 ఏళ్ళ బాలిక తనకన్నా చిన్నదైన మరో బాలికతో కలిసి ఇంట్లో ఉంది. ఆ సమయంలో షాబాద్, సల్మాన్, బిట్టు అనే ఈ కీచకులు ఐస్ క్రీం ఆశచూపి ఆ ఇద్దరు బాలికలను మరో ప్రాంతానికి తీసుకెళ్ళారు. ఐస్ క్రీంలో మత్తుమందు కలపడంతో, అది తినగానే ఆ బాలికలిద్దరూ సృహ కోల్పోయారు. ఇదే అదనుగా 13 ఏళ్ళ బాలికపై ఆ ముగ్గురూ తమ పశుకామం ప్రదర్శించారు.

దారుణంగా అత్యాచారం జరిపిన అనంతరం ఆ కీచకులు పరారయ్యారు. విషయం తెలిసిన బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు నిరాకరించడంతో.. మంత్రి షాహిద్ మన్ జోర్ ఇంటి ఎదుట బాధిత బాలిక బంధువులు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News