: కాంగ్రెస్ పై నమ్మకం లేదు: కోదండరాం
కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేదని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సంఘం అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఆంధ్రా, తెలంగాణ నేతల నుంచి రోడ్ మ్యాప్ లు తయారు చేయాలని ఎలా అడుగుతారని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలలోపు తెలంగాణ ప్రకటన చేయకుంటే మోసపూరిత ఎత్తుగడగా భావిస్తామని ఆయన తెలిపారు. జేఏసీ జనచైతన్య యాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 12 లేదా, 15 తేదీల్లో సాంస్కృతిక యాత్రలు చేపట్టనున్నట్టు కోదండరాం తెలిపారు.