: భారత్ ఫైనల్ చేరుతుందా?
భారత్, శ్రీలంకల మధ్య కీలక పోరు నేడు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరుగనుంది. గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో భారత జట్టు శ్రీలంకతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన శ్రీలంక ఫైనల్ చేరడంలో సందేహం లేదు. కానీ, భారత్ ఫైనల్ చేరాలంటే మాత్రం గెలవాల్సిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో విండీస్ గడ్డమీద అడుగుపెట్టిన శ్రీలంక సాధికారక ఆటతీరుతో టైటిల్ పోరు దిశగా సాగుతోంది. ఛాంపియన్ గా నిలిచిన భారత జట్టు పడుతూ లేస్తూ కీలకపోరుకు సిద్దమైంది.
భారత జట్టు చెత్త ప్రదర్శనకు తోడు ఆటగాళ్ల మధ్య స్పర్థలు జట్టులోని సమన్వయలోపాన్ని బయటపెడుతున్నాయి. దీంతో సరైన ప్రదర్శన చూపలేక టీమిండియా టైటిల్ రేసులో వెనుకబడిపోయింది. ఇప్పటికే విండీస్, శ్రీలంకలు చెరి రెండు మ్యాచ్ లు గెలవగా, బోనస్ పాయింటుతో గెలిచిన విండీస్ ఫైనల్ కు చేరినట్టే. బోనస్ పాయింటుతో ఒక మ్యాచ్ గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్ కు చేరుతుంది. ఓడినా, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా టీమిండియా ఇంటి బాటపట్టాల్సిందే!