: నర్సారావు పేటలో బంగారం, వెండి, నగదు అపహరణ
గుంటూరు జిల్లా నర్సారావు పేటలో కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం సమీపంలో ఉన్న కొత్త శ్రీనివాసరావు ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు శ్రీనివాసరావు ఇంట్లో ప్రవేశించి 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి సామగ్రి, 2 లక్షల రూపాయల నగదును తస్కరించారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. మంగళవారం తెల్లవారు ఝామున వచ్చి చూడగా ఇంటి తలుపులు, బీరువా పగలగొట్టి ఉన్నాయి. ఇది గమనించిన శ్రీనివాసరావు పోలీసులకు సమాచారమందించారు. గుంటూరు అర్బన్ పోలీసు స్టేషన్ టూటౌన్ ఎస్సై మౌలా షరీఫ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.